Tuesday, April 16, 2024

సీఎం కేసీఆర్‎కు ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి లేఖ‌..

ప్రభుత్వం వీఆర్ఏల డిమాండ్స్ ను వెంటనే అమలు చేయాలని సీఎం కేసీఆర్ కు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. చాలా రోజుల నుండి వీఆర్ఏలు వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తుంద‌ని, ఇందులో భాగంగా సమ్మె కూడా చేశార‌న్నారు. ప్రభుత్వం వారి డిమాండ్స్ నెరవేరుస్తామని హామీ కూడా ఇచ్చింద‌న్నారు. వెంటనే వీఆర్ఏలు కోరిన్నట్లు పే స్కేల్ పెంచాల‌న్నారు. 10 పాస్ అయిన‌ వారికి అటెండర్ గ్రేడ్ పే స్కేల్ పెంచి 22 వేల జీతం ఇవ్వాల‌న్నారు. ఇంటర్ పాస్ అయిన వీఆర్ఏలకు అసిస్టెంట్ గ్రేడ్ పే స్కేల్ ఇచ్చి 26 వేల జీతం ఇవ్వాల‌న్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే వీఆర్ఏలకు పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. త‌హ‌సీల్దార్‌, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్, కలెక్టర్ స్థాయి వారు కూడా వీరితో పని చేయించుకుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా పని చేస్తూ చాలా కష్టపడుతారు. 10 వేల 500 రూపాయల జీతం వీరికి సరిపోవు అన్నారు. బైక్ లో పెట్రోల్ పోసుకొని తిరుగడానికే సరిపోతాయ‌న్నారు. ఇంత పని భారం ఉన్న వీఆర్ఏలకు ప్రభుత్వం వెంటనే పే స్కేల్ పెంచి జీతాలు ఇవ్వాల‌న్నారు. వీఆర్ఏలు కోరుతున్నట్లు ఎక్స్ పీరియన్స్ ఉన్నవారికి ప్ర‌మోషన్స్ ఇవ్వాల‌న్నారు. అలాగే వారసత్వ ఉద్యోగాలకు అవకాశం కల్పించేలా జీవో ఇవ్వాల‌న్నారు. సమ్మె చేసిన 80 రోజుల జీతం కూడా ఇవ్వాల‌ని కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో వీఆర్ఏల సమస్య పై ప్రస్తావన తీసుకొని రావడం జరిగింద‌న్నారు. అలాగే మంత్రి కేటీఆర్ వీఆర్ఏలు సమ్మె చేస్తున్న సమయంలో చర్చలకు పిలిచి వీఆర్ఏల డిమాండ్స్ నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. కానీ ఎందుకో వీఆర్ఏల సమస్యలు ఇంకా పరిష్కారం కాలేద‌న్నారు. అందుకే ఈ లేఖ ద్వారా మరోసారి మీ దృష్టికి తీసుకొచ్చి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నా అన్నారు. ఇప్పటికైన వెంటనే వీఆర్ఏల డిమాండ్స్ ను నెరవేర్చాలని జ‌గ్గారెడ్డి లేఖ‌లో కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement