Thursday, April 25, 2024

ఎమ్మెల్యే గణేష్ గుప్తా ఆధ్యాత్మిక వారసత్వం ఎంతో గొప్పది: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

నిజామాబాద్ : ఆధ్యాత్మిక వారసత్వ లక్ష్యం నెరవేర్చే దిశలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా ఆలయాన్ని నిర్మించడం ఎంతో గొప్ప విషయం అని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. అర్బన్ ఎమ్మెల్యే శ్రీ బిగాల గణేష్ గుప్తా, వారి కుటుంబం కలిసి వారి సొంత గ్రామం మాక్లూర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన అయ్యప్ప సహిత, ఆంజనేయ శివ పంచాయతన సహిత శ్రీ రుక్మిణి పాండు రంగ విఠలేశ్వర దేవత ప్రతిష్ట పున:శ్చరణ మహోత్సవం మొదటి రోజు పూజ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గణేష్ గుప్తా తన తండ్రి బాటలో నడుస్తూ ఆధ్యాత్మిక వారసత్వం కూడా స్వీకరించి తన సొంత గ్రామంలో గుడి నిర్మించడం మంచి పరిణామం అని అన్నారు. ఊరి నడిమధ్యలో ప్రజలకు దర్శనార్థం ఎంతో గొప్పగా గుడిని తీర్చిదిద్దారని అన్నారు. వారికి భగవంతుడు మరింత మంచి జరిగేలా చూడాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ విఠల్ రావు, మహేష్ బిగాల, నిజామాబాద్ మేయర్ నీతూకిరణ్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement