Wednesday, May 25, 2022

రాజ్యాన్ని పాలిస్తున్నట్టుగా కేసీఆర్ తీరు: ఈటల ఫైర్

తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు హాజరు అయ్యే సభా ప్రాంగణాన్ని ఈటల రాజేందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా కేసీఆర్ పాలన సాగడం లేదని… ఓ రాజ్యాన్ని పాలిస్తున్నట్టుగా కేసీఆర్ తీరు ఉందని ఈటల దుయ్యబట్టారు. కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతూ కేసీఆర్ పాలిస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను కూడా కేసీఆర్ నెరవేర్చడం లేదన్నారు. కేసీఆర్ కు అహంకారం బాగా పెరిగిపోయిందన్న ఈటల… టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో కూడా వ్యతిరేకత పెరిగిపోయిందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ నియంతృత్వ పాలనకు ముగింపు పలికేందుకే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేపట్టారని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement