Saturday, November 27, 2021

అందరికీ అండగా ఉంటాం..అధైర్యపడవద్దు.. ఎమ్మెల్యే భూమన..

తిరుపతి .. ప్రభన్యూస్.. తిరుపతి నగరంలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో అతలాకుతలమైన ప్రాంతాలను ఎమ్.ఆర్ పల్లి. నారాయణపురం . శివ జ్యోతి నగర్ .వరద బాధితులను.ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సహాయ చర్యలు ముమ్మరం చేసేందుకు అధికారులతో పర్యటన చేశారు . లోతట్టు ప్రాంతాలను స్వయంగా పరిశీలించి అక్కడ ప్రజలను ఓదార్చి సహాయ చర్యలు అందిస్తామ‌న్నారు.. అవసరమైతే అందుబాటులో ఉండి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామ‌ని ప్రజలకు ధైర్యం కల్పిస్తూ పర్యటించారు… ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ .. తిరుపతి నగరంలో ఇంత వ‌ర్షం కుర‌వ‌డం ఇదే మొద‌టిసారి అన్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి సంఘటనలు జరగలేదన్నారు. కార్పొరేషన్ అధికారులు కూడా ప్రజలకు అందుబాటులో వాలెంటీర్స్ ద్వారా ప్రతి ఇంటికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి .. టోల్ ఫ్రీ నెంబర్ అందరికీ తెలిసే విధంగా ప్రచారం చేశామ‌న్నారు. అత్యవసరమైతే ఫోన్ చేస్తే తనతో పాటు అధికారులు కూడా వచ్చి సహాయ చర్యలు చేపడతారు అని వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News