Monday, July 26, 2021

టీఆర్ఎస్ ఎమ్మెల్యే నివాసంలో విషాదం

టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ నివాసంలో విషాదం నెలకొంది. చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌కు పితృ వియోగం కలిగింది. బాల్క సుమన్ తండ్రి, మెట్‌పల్లి మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ బాల్క సురేష్ హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందారు. కాగా ఎమ్మెల్యే బాల్క సురేష్ మృతి పట్ల పలువురు టీఆర్ఎస్ పార్టీ నేతలు సంతాపం తెలియజేశారు.

కాగా విషాదంలో ఉన్న ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు సీఎం కేసీఆర్ ఫోన్ చేసి ఓదార్చారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాల్క సురేష్ టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీల నాయకుడిగా చురుకైన పాత్ర పోషించారని, మెట్ పల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా సేవలు అందించారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News