Saturday, April 20, 2024

సీఎం జ‌గ‌న్ పాల‌న అద్భుతం-మ‌ళ్లీ అధికారం వైసీపీదే-ఆలీ

రాబోయే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ అధికారం వైసీపీదేన‌ని తెలిపారు సినీ నటుడు, వైసీపీ నేత అలీ. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. అవినీతికి తావు లేకుండా ప్రజల వద్దకే సంక్షేమ పాలనను అందించిన ఘనత జగన్ దని అన్నారు. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో వైసీపీ ప్రవాసాంధ్రులు నిర్వహించిన మహా గర్జనలో అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైసీపీ ఆస్ట్రేలియా కోఆర్డినేటర్ చింతలచెరువు సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పార్టీ అభిమానులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement