Tuesday, March 26, 2024

మీరాబాయికి బంఫర్ ఆఫర్.. లైఫ్ టైమ్ పిజ్జా ఫ్రీ..

టొక్యో ఒలింపిక్స్ 2021 లో భారత్ తరఫున తొలి పతకం సాధించిన మీరాబాయ్ చానుపై ప్రశంసల వర్షం కురుస్తోంది… వెయిట్‌ లిఫ్టింగ్‌లో 49 కిలోల విభాగంలో రజత పతకం సాధించి రికార్డు నెలకొల్పింది. స్నాచ్‌లో 87 కేజీలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 115 కేజీలు వెయిట్‌ ఎత్తి పతకం మీద ఆశలు పెంచింది. మొత్తంమీద 202 కేజీలు ఎత్తిన చాను.. స్వర్ణ పతకం కోసం జరిగిన మూడవ అటెంప్ట్‌లో విఫలమైంది. దాంతో రెండవ స్థానంలో నిలవడంతో రజత పతకం సొంతమైంది. దీంతో దేశవ్యాప్తంగా మీరాబాయ్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. అయితే ఇప్పటికే మీరాబాయ్ చానుకి కోటి నజరాన ప్రకటించింది మణిపూర్ ప్రభుత్వం.. అయితే తాజాగా మీరాబాయ్ కి డొమినోస్ పిజ్జా బంపర్ ఆఫర్ ప్రకటించింది. చానుకి లైఫ్ టైమ్ పిజ్జా ఆఫర్ ప్రకటించింది. మన దేశానికి పతకాన్ని తీసుకువచ్చి అందరి కలలను నిజం చేసిందుకు అభినందనలు.. రజతం తీసుకురావడం వల్ల మీరు మన దేశంలోని బిలియన్స్ ప్రజల జీవితాల్లోకి కలలను నిజం చేశారని ట్విట్టర్ లో పేర్కొన్న డొమినోస్.. మీ జీవితానికి సరిపడ పిజ్జాలను ఉచితంగా అందిస్తాము అని పేర్కొంటూ విషెస్ తెలిపింది. తాను పిజ్జాను చాలాకాలంగా తినలేదని, అందుకే నేను పిజ్జా తినాలని కోరుకుంటున్నట్లు మీరాబాయి ఇటీవల ఓ ఇంటర్వ్యూ పేర్కొన్నారు. దీంతో పతకం గెలిచిన వెంటనే డొమినోస్ ఇండియా జీవితకాలం ఉచిత పిజ్జా అందిస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని నెటిజన్లు కూడా స్వాగతించారు.

ఇది కూడా చదవండి: పాస్టర్లకు డబ్బులు ఇవ్వడం.. చర్చిలు నిర్మించడం.. ఇదేనా మీ ప్రాధాన్యత?: సోము వీర్రాజు

Advertisement

తాజా వార్తలు

Advertisement