Thursday, April 25, 2024

ఫోరెన్సిక్ ల్యాబ్ ని ప్రారంభించిన -మంత్రి తానేటి వ‌నిత‌

అనంతపురం : పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో నూతనంగా నిర్మించిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ను ప్రారంభించారు ఏపీ హోంశాఖామంత్రి తానేటి వనిత , రాష్ట్ర డిజిపి కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి.. ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీలో నిర్మించిన ఫిజికల్ ఎవిడెన్స్ రూం, సిరాలజీ కేస్ టేకింగ్ రూం, సిరాలజీ కేస్ అనాలసిస్ రూం, కంప్యూటర్ రిపోర్ట్ జనరేటింగ్ రూం, సిరాలజీ ఇన్స్ట్రక్సన్ రూం లను ప్రారంభించారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖామాత్యులు ఉషశ్రీ చర‌ణ్..ప్ర‌భుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, జడ్పీ ఛైర్మేన్ బోయ గిరిజమ్మ, నగర మేయర్ మహ్మద్ సలీం, స్థానిక కార్పోరేటర్ చింతకుంట సుశీలమ్మ, పిటిసి ప్రిన్సిపాల్ .. ఐజిపి వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, ఎమ్మెల్సు శివరామిరెడ్డి, అనంతపురం రేంజ్ డి.ఐ.జి ఎం.రవిప్రకాష్ , జిల్లా ఎస్పీ శ్రీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ పలువురు అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సి.ఐ లు, ఎస్సైలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement