Saturday, April 20, 2024

నిబంధనలు గాలికి…వాతి కమింగ్ అంటూ మంత్రి చిందులు

కరోనా నిబంధనలు గాలికి వదిలేశారు వైసీపీ మంత్రి సీదిరి అప్పలరాజు. మూతికి మాస్క్ లు లేదు…సామాజిక దూరం లేదు..దానికి తోడు వాతి కమింగ్ అంటూ చిందులు తొక్కారు. మాములుగా హీరో హీరోయిన్లు డ్యాన్స్ చేయటం కామన్… అదే రాజకీయ నాయకులు డాన్సులు వేస్తే సోషల్ మీడియాలో ఆ వీడియోలు కచ్చితంగా వైరల్ అవుతాయి. అవును కుమారుడి పుట్టినరోజు వేడుకల్లో మంత్రి అప్పలరాజు వేసిన చిన్నపాటి స్టెప్పులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అవుతున్నాయి.

పలాస లోని తన స్వగృహంలో మంత్రి అప్పలరాజు డాన్స్ చేశారు. తన కుమారుడు ఆరవ్ వర్మ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి డ్యాన్సులు చేశారు.కాగా ఈ వీడియోలు చూసిన వారంతా కూడా కరోనా కేసులు ఒకవైపు పెరుగుతుంటే కనీస నియమాలు కూడా పాటించకుండా అధికారం చేతిలో ఉందని మంత్రి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement