Thursday, December 5, 2024

రియ‌ల్ లైఫ్‌లో రియ‌ల్ హీరో జ‌గ‌నే – ట్రాక్ట‌ర్ న‌డిపిన మంత్రి రోజా

వైఎస్సార్ యంత్ర సేవా పేరిట సీఎం వైఎస్ జ‌గ‌న్ కొత్త ప‌థ‌కానికి శ్రీకారం చుట్టారు. జ‌గ‌న్ కేబినెట్‌లో మంత్రిగా కొన‌సాగుతున్న రోజా త‌న సొంత నియోజ‌కవ‌ర్గం న‌గ‌రి నుంచి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాదిరే ఉత్సాహంగా ట్రాక్ట‌ర్ ఎక్కిన రోజా స్వ‌యంగా ట్రాక్ట‌ర్ న‌డిపారు. అనంత‌రం మీడియా ప్ర‌తినిధుల‌తో మాట్లాడిన ఆమె… టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ లపై ప‌వ‌ర్ ఫుల్ పంచ్‌లు సంధించారు. టీడీపీ, జ‌న‌సేన‌తో పాటు ఎన్ని పార్టీలు గుంపులుగుంపులుగా వ‌చ్చినా జ‌గ‌న్ సింహం సింగిల్‌గానే వ‌స్తుంద‌ని ఆమె చెప్పారు. ప్ర‌జ‌ల‌కు మంచి ఆలోచ‌న చేయాల‌ని ఉందా? లేదంటే ప‌ద‌వులే ప‌ర‌మావ‌ధిగా పెట్టుకున్నారా? అన్న విష‌యంపై ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో పాటు చంద్రబాబు కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆమె చెప్పారు. చంద్ర‌బాబు ఎప్పుడు కూడా ఒంట‌రిగా పోరాటం చేసే నేత కాద‌ని, నిత్యం ఆయ‌న పొత్తుల‌తోనే ముందుకు సాగుతున్నార‌న్నారు. రియ‌ల్ లైఫ్‌లో రియ‌ల్ హీరో జ‌గ‌నేన‌ని చెప్పిన రోజా.. ప‌వ‌న్ రీల్ హీరో మాత్ర‌మేన‌ని, ఆయ‌న రియ‌ల్ హీరో కాలేర‌ని తేల్చి చెప్పారు. ఏ ఎన్నిక‌లు వ‌చ్చినా వార్ వ‌న్ సైడ్ అన్న‌ట్లుగానే ఉంటుంద‌ని రోజా చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement