Friday, March 29, 2024

ఎన్టీఆర్ పేరు వింటేనే చంద్ర‌బాబుకి వ‌ణుకు – మంత్రి రోజా

ఎన్టీఆర్ పేరు వింటేనే చంద్ర‌బాబునాయుడుకి వ‌ణుకుపుడుతుంద‌ని మంత్రి రోజా అన్నారు.జూనియ‌ర్ ఎన్టీఆర్ కు కూడా చంద్ర‌బాబు భ‌య‌ప‌డ‌తార‌ని ఆరోపించారు. అందుకే పార్టీ నుంచి బ‌య‌టికి త‌రిమేశార‌న్నారు. నేడు తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు మంత్రి రోజా. ఈ సంద‌ర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ పేరు అంటేనే చంద్ర‌బాబుకు న‌చ్చ‌ద‌న్నారు.చంద్ర‌బాబు ఇన్ని ఏళ్ల‌ల్లో చేయ‌ని అభివృద్ధిని ..సీఎం జ‌గ‌న్ మూడేళ్ల‌లో చేసి చూపించార‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement