Friday, April 19, 2024

డీజే స్నేక్ ని కలిసిన.. మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు

ఫ్రెంచ్ సంగీతకారుడు డీజే స్నేక్ ని కలిశారు తెలంగాణ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు. డీజే సంగీతాన్ని కొత్త పుంతలు తొక్కించి, డీజేనే తన ఇంటి పేరుగా మార్చుకున్న డీజే స్నేక్ అసలు పేరు విలియమ్ సామి ఎటియన్నె గ్రిగహసిన్. కాగా, డీజే స్నేక్ సంగీత కచేరీ ఈ నెల 20న హైదరాబాద్ లో జరిగింది. సన్ బర్న్ ఈవెంట్ లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి కల్వకుంట్ల హిమాన్షు కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను హిమాన్షు సోషల్ మీడియాలో పంచుకున్నారు. డీజే స్నేక్ ను కలవడం ఎంతో సంతోషం కలిగించిందని తెలిపారు. తాను ఇప్పటివరకు కలిసిన వారిలో డీజే స్నేక్ ఎంతో వినయశీలి అని, నిరాడంబరమైన వ్యక్తి అని కొనియాడారు హిమాన్షు.

Advertisement

తాజా వార్తలు

Advertisement