Tuesday, October 19, 2021

రేవంత్‌రెడ్డికి మంత్రి కేటీఆర్ సవాల్.. లైడిటెక్టర్ టెస్టుకు రేవంత్ సిద్ధమా?

తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్‌పై టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తాను ఎలాంటి టెస్టుల‌కైనా సిద్ధంగా ఉన్నాను. రాహుల్ గాంధీ కూడా డ్ర‌గ్స్ టెస్టుకు సిద్ధ‌మైతే.. తానే ఢిల్లీ ఎయిమ్స్‌కు వెళ్తాన‌ని కేటీఆర్ ట్వీట్ చేశారు. చ‌ర్ల‌ప‌ల్లి జైలుకు వెళ్లొచ్చిన వారితో టెస్టులు చేయించుకునే స్థాయి త‌న‌ది కాదు అని కేటీఆర్ పేర్కొన్నారు.

ఒక వేళ తాను టెస్టులు చేయించుకుని క్లీన్‌చీట్‌తో వ‌స్తే రేవంత్ రెడ్డి త‌న‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పి, ప‌ద‌వులు వ‌దులుకుంటారా? అని కేటీఆర్ సూటిగా అడిగారు. ఓటుకు నోటు కేసులో లై డిటెక్ట‌ర్ టెస్టుల‌కు రేవంత్ సిద్ధ‌మా? అని కేటీఆర్ అడిగారు. కాగా డ్రగ్స్ కేసులో మంత్రి కేటీఆర్ ఉన్నారని కొన్నిరోజులుగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News