Saturday, April 20, 2024

మంత్రి కేటీఆర్‌పై డాక్యుమెంటరీ ఫిల్మ్ విడుదల

ఈనెల 24న మంత్రి, టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా KTR అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ విడుద‌లైంది. తుంగ‌తుర్తి ఎమ్మెల్యే డా.గాద‌రి కిశోర్ స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందిన ఈ డాక్యుమెంట‌రీ ఫిల్మ్‌ను తెలంగాణ భవన్‌లో మంత్రి జగదీష్ రెడ్డి విడుద‌ల చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమా భరత్ గుప్తా, తక్కెలళ్లి రవీందర్ రావు, రాష్ట్ర ఉన్నత విద్యామండలి సభ్యులు ఒంటెద్దు నర్సింహారెడ్డి, డైరెక్టర్ ఎన్. శంకర్, జ‌డ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, రాష్ట్ర నాయకులు నంద్యాల దయాకర్ రెడ్డి, గుజ్జ యుగేందర్ రావు, టీఆర్ఎస్‌, టీఆర్ఎస్‌వీ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

ఈ వార్త కూడా చదవండి: హైదరాబాద్‌లో ఈనెల 25, 26 తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు

Advertisement

తాజా వార్తలు

Advertisement