Thursday, October 10, 2024

భద్రాద్రి రామ‌య్యను ద‌ర్శించుకున్న మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి

భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి దర్శించుకున్నారు. సతీసమేతంగా భద్రాద్రి ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతంపలికారు. అనంత‌రం ప్రధాన ఆలయంలో శ్రీసీతారామచంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు మంత్రికి వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలు అందించారు. ఆ తర్వాత భ‌క్తులకు తాగునీటి కోసం ఏర్పాటు చేసిన జ‌ల‌ప్రసాదాన్ని (ఆర్వో ప్లాంట్) మంత్రి ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement