Friday, September 29, 2023

త్వరలోనే 50 వేల ఉద్యోగాల భర్తీ: మినిస్టర్ హరీష్

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే 50 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు. 50 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలిచ్చారని.. దీంతో త్వరలోనే ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల అవుతుందన్నారు. ఇక ఉద్యోగుల అనుభవాన్ని ఉపయోగించుకోవాలనే వారి రిటైర్మెంట్ వయసును పెంచామన్నారు హరీష్. ఇది ఉద్యోగాల భర్తీకి ఏ మాత్రం అడ్డంకి కాదన్నారు.

ఇటీవల పీఆర్సీ ని పెంచటంతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని 58 సంవత్సరాల నుంచి 61 కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పెంచారు. దీనితో నిరుద్యోగ యువత అంతా కూడా ఆందోళన బాట పట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement