Tuesday, March 21, 2023

రేపు మంత్రి హరీష్ రావు పర్యటన.. ఏర్పాట్లు ప‌రిశీలించిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్

రూ.200 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
చెన్నూరు నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు బుధవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని భీమారం, జైపూర్, చెన్నూరు లో అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ 40 ఏళ్లలో జరగని అభివృద్ధి నాలుగేళ్లలో చేసి చూపామన్నారు. 200 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు మంత్రి హరీష్ రావు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన అనంతరం మార్కెట్ యార్డులు ఆవరణలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. ఎమ్మెల్యే వెంట ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement