Thursday, March 28, 2024

వరంగల్ రూరల్ జిల్లా పేరు మార్పు!

వరంగల్ రూరల్ జిల్లా పేరు మార్పుపై ‌ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వరంగల్ రూరల్ జిల్లా పేరును హన్మకొండగా మార్చే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. వరంగల్, అర్బన్ రూరల్ జిల్లాలను వరంగల్, హన్మకొండ చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అదే పేర్లతో కొనసాగించాలని సీఎం కేసీఆర్ ను కోరతామని తెలిపారు. ఈనెల 21న సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు.

తెలంగాణ‌లో జిల్లాల విభజనలో భాగంగా ఉమ్మడి వరంగల్‌ను వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, జనగామగా జిల్లాలు ఏర్పాటు చేశారు. అయితే, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ పేర్ల‌ను మార్చాలని విజ్ఞప్తులు వచ్చాయి. అయితే, ప్రభుత్వం మాత్రం పేర్లను మార్చలేదు. తాజగా సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement