Friday, April 19, 2024

మంత్రి అవంతి శ్రీనివాస్ రాసలీలల ఆడియో.. సోషల్ మీడియాలో వైరల్

వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ చిక్కుల్లో పడ్డారు. రాసలీలల పేరుతో ఆయనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళతో సరసాలు ఆడుతున్నట్లుగా ఉన్న ఆడియో ముమ్మూటికీ మంత్రి అవంతి శ్రీనివాస్‌దేనంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

‘పిచ్చి వేషాలు వేయకుండా ఇంటికి రా.. నా మాట విను. అన్ని రకాలుగా బాగుంటుంది. ఓ అరగంటలో పంపిస్తా’ అంటూ మంత్రి ఆ మహిళతో సరసాలాడటం ఈ ఆడియోలో వినిపిస్తోంది. ‘నాతో అరగంట కూడా స్పెండ్ చేయలేవా?. మాటలకు, చేతలకు చాలా తేడా ఉంది. చెప్పిన మాట విను’ అంటూ మహిళను అవంతి బతిమాలుతున్నట్లుగా ఈ ఆడియో ఉంది. మొత్తానికి ఈ ఆడియో అవంతిదో కాదో నిర్ధారణ కాకపోయినా మంత్రి రాసలీలలపై సోషల్ మీడియాలో మాత్రం హోరెత్తుతోంది. అయితే ఈ వీడియోపై మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement