Tuesday, April 23, 2024

మైండ్‌ స్పేస్‌ ఆర్‌ఈఐటీ వృద్ది.. 4.5 మిలియన్‌ చదరపు అడుగులు

మైండ్‌ స్పేస్‌ బిజినెస్‌ పార్క్స్‌ ఆర్‌ఈఐటీ భారతదేశంలోని నాలుగు కీలక కార్యాలయ మార్కెట్స్‌లో ఉన్న క్వాలిటీ గ్రేడ్‌ ఏ ఆఫీస్‌ పోర్ట్‌ ఫోలియో, డెవలపర్‌ మార్చి 31తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను వెల్లడించింది. గ్రాస్‌ లీజింగ్‌ 2021-22 ఆర్థిక సంవత్సరంలో 0.7 మిలియన్‌ స్క్వేర్‌ ఫిట్స్‌ నమోదవ్వగా.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 4.5 మిలియన్‌ స్క్వేర్‌ ఫిట్స్‌గా రికార్డయ్యింది. ఏడాది ప్రాతిపదికన పోల్చుకుంటే.. 28.4 శాతం వృద్ధి సాధించింది. ఇక నెట్‌ ఓపెన్‌ ఇన్‌కం చూసుకుంటే.. 2021-22 ఆర్థిక సంవత్సరం నాల్గో త్రైమాసికంలో 3,960 మిలియన్‌ రూపాయలు నమోదవ్వగా.. 2021-22 ఆర్థిక సంవత్సరం మొత్తంలో 14,864 మిలియన్‌ రూపాయలుగా రికార్డయ్యింది. ఏడాది ప్రాతిపదికన చూసుకుంటే.. 8.2 శాతం వృద్ధి రికార్డయ్యింది. రీ-లీజింగ్‌ స్ప్రెడ్‌ 2.8 మిలియన్‌ స్క్వేర్‌ ఫిట్‌ ఏరియా రీ-లెట్‌ మీద 31.0 శాతం వద్ద ఉంది. 1.2 మిలియన్‌ స్క్వేర్‌ ఫిట్‌ నిర్మాణంలో ఉన్న ప్రాంతం ముందుగా కట్టుబడి ఉండటంతో డిమాండ్‌లో బలమైన బౌన్స్‌ బ్యాక్‌ కనిపించింది. స్థలంలో అద్దెలు.. ఏడాది కాలంలో 10.3 శాతం పెరిగి.. నెలకు ఒక్కో రూ.61.7 పీఎస్‌ఎఫ్‌గా రికార్డయ్యింది. మొత్తం లీజుప్రాంతం 1.6 మిలియన్‌ స్క్వేర్‌ ఫిట్‌కు పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement