Tuesday, March 26, 2024

కూలిన మిల‌ట‌రీ హెలికాప్ట‌ర్-14మంది మృతి-డ్ర‌గ్ స్మ‌గ్ల‌ర్ రాఫెల్ కారో అరెస్ట్

బ్లాక్ హాక్ మిల‌ట‌రీ హెలికాఫ్ట‌ర్ కూలింది.ఈ ఘ‌ట‌న‌లో 14మంది మృతి చెంద‌గా..మ‌రో వ్య‌క్తి తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. ఈ ప్ర‌మాదం మెక్సికోలోని సినాలోవాలో చోటు చేసుకుంది.హెలికాప్టర్ ఎందుకు కూలిందన్న దానిపై దర్యాప్తు జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు. అదే సమయంలో కరుడుగట్టిన డ్రగ్ స్మగ్లర్ రాఫెల్ కారో క్వింటరోను నేవీ అరెస్ట్ చేసింది. చాపర్ కూలిన ఘటనతో అతడికేమైనా సంబంధం ఉందా అనే వివరాలు మాత్రం తెలియరాలేదు. 1985లో యూఎస్ యాంటీ నార్కోటిక్స్ ఏజెంట్‌ను చిత్రహింసలకు గురిచేసి హత్య చేసిన కేసులో రాఫెల్ దోషి అని నేవీ తెలిపింది.

దేశంలోని మాదక ద్రవ్యాల రవాణా కేంద్రాలలో ఒకటైన వాయవ్య రాష్ట్రమైన సినాలోవాలోని చోయిక్స్ మునిసిపాలిటీలో రాఫెల్ పట్టుబడ్డాడని పేర్కొంది. 1980లలో లాటిన్ అమెరికాలో అత్యంత శక్తిమంతమైన మాదకద్రవ్యాల అక్రమ రవాణా సంస్థలలో ఒకటైన గ్వాడలజారా కార్టెల్ వ్యవస్థాపకుల్లో రాఫెల్ ఒకడు. మెక్సికన్ నేవీ అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిన వెంటనే అమెరికా స్పందించింది. అతడిని పట్టుకున్న అధికారులను ప్రశంసించింది. ఇది చాలా పెద్ద ఘనత అని, ఆలస్యం చేయకుండా అతనిని తమకు అప్పగించాలని కోరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement