Friday, April 19, 2024

బాలకృష్ణ కెరీర్ లో మైల్ స్టోన్.. అఖండకి ఏడాది

ద‌ర్శ‌కుడు బోయ‌పాటి..హీరో బాల‌కృష్ణ కాంబినేష‌న్ లో వ‌చ్చిన మూడ‌వ‌చిత్రంగా రూపొందింది అఖండ చిత్రం. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కించారు.ఈ మూవీ రిలీజ్ అయి సంవ‌త్స‌రం అయింది. కాగా ఈ చిత్రం బాలకృష్ణ కెరీర్‌లో వన్‌ ఆఫ్ ది మైల్ స్టోన్ మూవీగా నిలిచింది .ఈ చిత్రంలో ప్రగ్యాజైశ్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్ లో న‌టించింది. శ్రీకాంత్ విల‌న్‌గా న‌టించగా.. జ‌గ‌ప‌తిబాబు, పూర్ణ కీల‌క పాత్రలు పోషించారు.

అఖండ 2021 డిసెంబర్ 2న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. మ్యూజిక్‌ డైరెక్టర్ ఎస్ థ‌మ‌న్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అఖండ సక్సెస్‌లో కీ రోల్‌ పోషించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అఖండ పాత్ర పరకాయ ప్రవేశం చేసిన వచ్చే సన్నివేశాలు థమన్‌ స్కోర్‌తో ప్రేక్షకులకు థ్రిల్‌ అందించడమే కాదు.. గూస్‌ బంప్స్ తెప్పిస్తాయి. సెకండాఫ్‌లో వచ్చే బీజీఎం, అఘోరాల ఎపిసోడ్‌ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement