Saturday, April 17, 2021

టైటిల్ ముంబైదే..వాన్ జోస్యం..ఫ్యాన్స్ ఫైర్

ఐపీఎల్‌ 14వ సీజన్ కి అంతా సిద్దమయింది. రేపటి నుంచి మ్యాచులు ప్రారంభం కానున్నాయి. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబై ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టైటిల్‌ విజేత ఎవరనే అంశంపై మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు తమతమ అంచనాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కూడా ట్విటర్ వేదికగా తన అంచనాలను పంచుకున్నాడు. సీజన్ ప్రారంభానికి ముందే టైటిల్ గెలిచే జట్టేదో చెప్పేశాడు. వాన్‌ అంచనాల ప్రకారం.. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్సే ఈసారి కూడా టైటిల్ గెలిచి సిక్సర్ కొడుతుందని జోస్యం చెప్పాడు. ఏదో అద్భుతం జరిగితే తప్పా ఆ జట్టు వట్టి చేతులతో వెళ్లదన్నాడు. ముంబై కానీ పక్షంలో టైటిల్‌ గెలిచే అవకాశం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మాత్రమే ఉందన్నాడు. అయితే వాన్‌ ప్రిడిక్షన్‌పై  మిగతా ఐపీఎల్‌ జట్ల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నీ నువ్వే డిసైడ్‌ చేస్తే, ఇన్ని జట్లు ఆడటం ఎందుకని  చురకలంటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News