Thursday, March 28, 2024

విజ‌య్ అన్నా ల‌వ్ యూ.. ట్వీట్ చేసిన సందీప్ కిష‌న్

మైఖేల్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు యంగ్ హీరో సందీప్ కిష‌న్.. మైఖేల్ చిత్రంలో విజయ్‌ సేతుపతి, వరలక్ష్మి శరత్‌కుమార్‌, అనసూయ భరద్వాజ్‌, వరుణ్ సందేశ్‌, గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ, కరణ్ సీ ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ చిత్రానికి శ్యామ్‌ సీఎస్‌ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి.కాగా రీసెంట్ గా తమిళ స్టార్ హీరో విజయ్ ని కలిశాడు సందీప్ కిషన్..ఈ మేర‌కు మైఖేల్ సినిమాపై విజయ్‌ చూపించిన మద్దతు, ప్రేమ పట్ల సంతోషం వ్యక్తం చేశారు సందీప్‌ కిషన్‌. ఎంతో వినయపూర్వకంగా, స్పూర్తిదాయకంగా ఉన్నందుకు ధన్యవాదాలు.. లవ్‌ యూ అన్నా అని ట్వీట్ చేశారు సందీప్ కిషన్‌. స్టార్ హీరోతో సందీప్‌ కిషన్ దిగిన స్టిల్‌ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement