Wednesday, April 24, 2024

విశాల్ ఛాతీపై.. ఎంజీఆర్ ప‌చ్చ‌బొట్టు

త‌ర‌చూ ప‌లు వివాదాస్ప‌ద వార్త‌ల్లో నిలుస్తూ ఉంటారు త‌మిళ హీరో విశాల్. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ ఫొటోను గుండెపై పచ్చబొట్టు వేయించుకున్నాడు విశాల్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. ఎలాంటి సందర్భం లేకుండా విశాల్‌ తన ఛాతీపై ఎంజీఆర్‌ టాటూను వేయించుకోవడం కోలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
తాను ఎంజీఆర్‌కు అభిమాని అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు విశాల్‌. రాబోయే ఎన్నికల్లో అతను అన్నాడీఎంకే తరఫున ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారని, అందుకే ఆయన ఆ పార్టీకి దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఏదైనా సినిమాలోని పాత్ర కోసం అలా ప్రయత్నించారేమోనంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అస‌లు విశాల్ ప‌చ్చ‌బొట్టు ఎందుకు వేయించుకున్నారో అనే చ‌ర్చ న‌డుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement