Wednesday, April 24, 2024

మార్చి 29న.. మీట‌ర్ ట్రైల‌ర్

మాంచి దూకుడుమీదున్నాడు యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం. రీసెంట్ గా విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ హీరో మీట‌ర్ సినిమాతో సంద‌డి చేయ‌నున్నాడు.ఈ మూవీ ట్రైలర్‌ అప్‌డేట్‌ను ప్రకటించారు మేక‌ర్స్. ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 29న రిలీజ్‌ చేస్తున్నట్లు పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు.ఈ పోస్టర్‌లో హీరో కిరణ్ అబ్బ‌వ‌రం అల్ట్రా స్టైలిష్‌లుక్‌లో అదరగొడుతున్నారు. ఈ సినిమాలో కిరణ్‌ పోలీస్‌ అధికారిగా కనిపించబోతున్నారు. క్లాప్‌ ఎంటర్‌టైనమెంట్స్‌ పతాకంపై చెర్రీ, హేమలత పెదమాళ్లు ఈ సినిమాను నిర్మించారు. సాయి కార్తిక్‌ స్వరాలు అందించాడు. ఇప్పటికే రిలీజైన పాటలన్ని చార్ట్‌ బస్టర్‌గా ఇటీవలే డిస్ట్రిబ్యూషన్‌ సంస్థను స్థాపించిన మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తుంది.రమేష్‌ కాడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటుంది. యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్‌ 7న ప్రేక్షకులు ముందుకు రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement