Thursday, April 25, 2024

కిర‌ణ్ అబ్బ‌వ‌రం పోలీస్ గా మీట‌ర్.. లిరిక‌ల్ సాంగ్ రిలీజ్

మీట‌ర్ చిత్రం నుండి లిరిక‌ల్ సాంగ్ ని రిలీజ్ చేశారు మేక‌ర్స..చమ్మక్ చమ్మక్ పోరి .. న ధడకు ధడకు నారి’ అంటూ ఈ పాట సాగుతోంది. సాయికార్తీక్ స్వరపరిచిన ఈ పాటకు బాలాజీ సాహిత్యాన్ని అందించగా, అరుణ్ కౌండిన్య – గాయత్రి ఆలపించారు. భాను కొరియోగ్రఫీ ఆకట్టుకుంటోంది. ఏప్రిల్ 7వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కిరణ్ అబ్బవరం హీరోగా న‌టిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ – క్లాప్ వారు నిర్మించిన ఈ సినిమాకి రమేశ్ దర్శకత్వం వహించాడు. పోలీస్ ఆఫీసర్ గా కిరణ్ అబ్బవరం నటించిన ఈ సినిమాతో, తెలుగు తెరకి అతుల్య రవి కథానాయికగా పరిచయమవుతోంది. వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాతో హిట్ కొట్టిన కిరణ్, పెద్దగా గ్యాప్ లేకుండానే ‘మీటర్’ తో వస్తున్నాడు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement