Thursday, April 25, 2024

క‌స్ట‌డీ నుండి జ‌న‌వ‌రి1న స‌ర్ ప్రైజ్.. పోస్ట‌ర్ రిలీజ్ చేసిన మేక‌ర్స్

క‌స్ట‌డీ చిత్రం నుండి జ‌న‌వ‌రి1న స‌ర్ ప్రైజ్ ఇవ్వ‌నున్న‌ట్లు పోస్ట‌ర్ రిలీజ్ చేశారు మేక‌ర్స్. క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని హీరో నాగచైతన్య టీం ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందించి మూవీ లవర్స్ లో జోష్ నింపింది.ఈ చిత్రంలో కృతిశెట్టి మరోసారి నాగచైతన్యకు జోడీగా నటిస్తోంది. ఈ చిత్రంలో శివ అనే పోలీసాఫీసర్‌గా నాగచైత‌న్య కనిపించనున్నారు. కస్టడీలో వెన్నెల కిశోర్‌, శరత్‌కుమార్‌, ప్రేమ్‌గీ అమ‌రేన్‌, సంప‌త్ రాజ్, ప్రియమణి కీల‌క పాత్రలు పోషిస్తున్నారు.

అరవింద్‌ స్వామి విలన్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా, యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందిస్తున్నారు నూతన సంవత్సర కానుకగా కస్టడీ క్రేజీ అప్‌డేట్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 2023 జనవరి 1న అప్‌డేట్‌ ప్రకటించనున్నట్టు మేకర్స్ ట్వీట్ చేశారు. సస్పెన్స్ గా ట్వీట్ పెట్టడంతో న్యూఇయర్‌కు రాబోయేది కస్టడీ టీజర్ అయి ఉంటుందని అంతా తెగ చర్చించుకుంటున్నారు. దీనిపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement