Thursday, April 18, 2024

మెగావారి ఇంట ఉగాది సెల‌బ్రేష‌న్స్..

మెగావారి ఇంట ఉగాది సెల‌బ్రేష‌న్స్ జ‌రిగాయి. ఉగాదిని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి తన ఇంట భక్తి శ్రద్ధలతో దైవారాధన చేస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారాయి. చిరంజీవి- ఆయన భార్య సురేఖ తమ మనవరాళ్లు సహా ఇతర కుటుంబ సభ్యులతో ఉగాది పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే చిరంజీవి ఉగాది పండుగ క్షణాలను తన ఫాలోవర్స్ తో షేర్ చేసుకున్నారు. అభిమానులందరికీ తన శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ శుభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలు అంటూ పూల బోకేల ఈమోజీలను షేర్ చేసారు.#HappyUgadi తో ట్విట్టర్ లో షేర్ చేసిన ఫోటోలో అంజనీపుత్రుడు ఆంజనేయుని ప్రత్యేక విగ్రహాన్ని ఎంతో అందంగా అలంకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement