Wednesday, April 24, 2024

మేఘాలయ, నాగాలాండ్‌లలో పోలింగ్ ప్రారంభం

షిల్లాంగ్, కోహిమా: మేఘాలయ, నాగాలాండ్‌లలో సోమవారం ఉదయం గంటలకు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 60 మంది సభ్యులున్న మేఘాలయ అసెంబ్లీ కి జరుగుతున్న ఎన్నికల్లో 369 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అధికార నేషనల్ పీపుల్స్ పార్టీకి భారతీయ జనతాపార్టీ నుంచి గట్టి పోటి నెలకొంది. 640 పోలింగ్ కేంద్రాల్లో 323 కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. మేఘాలయలో పోలింగ్ స్వేచ్ఛగా, ప్రశాంతంగా సాగుతుందని ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఎఫ్ఆర్ ఖర్ కోంగర్ చెప్పారు.

నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం ప్రారంభమైంది. 59 అసెంబ్లీ స్థానాల్లో 183 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. నాగాలాండ్ లో 13 లక్షల మంది ఓటర్లు పోలింగ్ పర్వంలో పాల్గొననున్నారు.ప్ల్ ఉదయం గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగియనుంది

Advertisement

తాజా వార్తలు

Advertisement