Thursday, March 28, 2024

అలయ్ బలయ్ లో చిందేసిన మెగాస్టార్ చిరంజీవి.. గాడ్ ఫాదర్ హిట్ చేసినందుకు థ్యాంక్స్..

హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించిన అలయ్ బలయ్ లో మెగాస్టార్ చిరంజీవి చిందేశారు. పోతురాజులతో కలిసి చిరంజీవి డ్యాన్స్ చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి డోలు వాయించి డ్యాన్స్ చేశారు. పార్టీలకతీతంగా బండారు దత్తాత్రేయ అందరినీ ఆహ్వానించారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిప‌డేలా కళాప్రదర్శనలు చేశారు. ఈసందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ… గాడ్ ఫాదర్ ను సూపర్ హిట్ చేసినందుకు ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెబుతున్నానన్నారు. అలయ్ బలయ్ కు రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాన్నారు. గతేడాది మా తమ్ముడికి అవకాశం వచ్చిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement