Tuesday, September 21, 2021

మెగాస్టార్ 153వ సినిమా పేరు ఎంటో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా తన సినిమాలకు సంబంధించిన ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ షూటింగ్‌ పూర్తి చేశారు. తాజాగా చిరు 153వ సినిమా టైటిల్‌ ను రివీల్ చేశారు. మోహన్ రాజా దర్శకత్వంలో చేస్తోన్న సినిమాకు  ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ ఖరారు చేసారు. మలయాళ బ్లాక్‌బస్టర్‌ ‘లూసిఫర్‌’ రీమేక్‌గా ఇది తెరకెక్కుతోంది. ఆగస్టు 22న చిరు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి శనివారం చిరు ప్రీలుక్‌తో పాటు, టైటిల్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. తాజా చిత్రానికి ‘గాడ్‌ ఫాదర్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, సూపర్‌గుడ్‌ ఫిల్మ్ష్‌ పతాకంపై ఆర్‌.బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

ఇది కూడా చదవండిః మెగాస్టార్ బర్త్ డేః చిరంజీవికి అభిమానులు ఇచ్చే కానుక ఎంటంటే..

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News