Wednesday, October 16, 2024

తమిళనాడు సీఎం స్టాలిన్‌ను కలిసిన మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి నేడు చెన్నైలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తమిళనాడు సీఎంగా అధికారం చేపట్టిన తర్వాత స్టాలిన్ తనదైన శైలిలో పాలన చేపడుతూ, అందరి అభినందనలు అందుకుంటున్నారు. ఇటీవలి ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన స్టాలిన్ కొన్ని నెలల వ్యవధిలోనే ఉత్తమ సీఎంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం స్టాలిన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన చిరంజీవి ఆయనను అభినందించారు. స్టాలిన్‌కు పుష్పగుచ్ఛం అందించి శాలువా కప్పారు. ఈ కార్యక్రమంలో స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ కూడా ఉన్నట్లు ఫోటోలలో కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement