Thursday, April 25, 2024

నేను రాజకీయాల నుంచి దూరంగా ఉన్నా..రాజకీయం నా నుంచి దూరం కాలేదు -మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి చేసిన వాయిస్ ట్వీట్ వైర‌ల్ అవుతోంది. ట్విట్టర్‌ పోస్టు చేసిన ఓ ఆడియో క్లిప్‌లో.. నేను రాజకీయాల నుంచి దూరంగా ఉన్నాను. కానీ రాజకీయాలు నా నుంచి దూరం కాలేదు అని అన్నారు. అయితే ఈ డైలాగ్ తన తాజా చిత్రం గాడ్‌ ఫాదర్‌కు సంబంధించింగా తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రస్తుతం చిరంజీవి నోటి వెంట ఈ విధమైన డైలాగ్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ డైలాగ్‌కు సంబంధించిన ఆడియోను పోస్టు చేసిన చిరంజీవి.. ఎలాంటి సందేశాన్ని కానీ, సినిమాకు సంబంధించిన వివరాలను కూడా పొందుపరచలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement