Friday, April 26, 2024

మెగా ఫ్యాన్స్ కు మెగా అప్‌డేట్.. రీ-రిలీజ్ కు రెడీ అయిన రామ్ చరణ్ మూవీ

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అభిమానుల కోసం ఆసక్తికరమైన అప్‌డేట్.. వ‌రల్డ్ వైడ్ బ్లాక్ బస్ట‌ర్ RRR కి సినిమా కంటే ముందు డైరెక్టర్ SS రాజమౌళి దర్శకత్వం వ‌హించిన‌ మగధీర మూవీలో హీరోగా నటించారు చ‌ర‌ణ్. అయితే, ఆ మూవీని ప్రోడ్యూస్ చేసిన ప్ర‌ముఖ ప్రోడ‌క్ష‌న్ సంస్థ‌ గీతా ఆర్ట్స్ ఈ మూవీకి సంబంధించిన ఓ కీలక విషయాన్ని ప్రకటించింది.

మ‌హేష్ బాబు పోకిరీ సినిమాతో స్టార్ట్ అయిన‌ రీ-రిలీజ్ ట్రెండ్ టాలీవుడ్‌లో ఇప్ప‌టికీ ట్రెండ్ కొనసాగుతోంది. ఈ సంద‌ర్బంగా, ఇండస్ట్రీ హిట్ అయిన మగధీరను వ‌చ్చే నెల‌ మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజున మళ్లీ థియేటర్లలో గ్రాండ్ రీ-రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఈరోజు గీతా ఆర్ట్స్ ప్రకటించింది.

పీరియాడికల్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెర‌కెక్కిన మగధీర మూవీలో కాజల్ అగర్వాల్, దేవ్ గిల్, శ్రీహరి, రావు రమేష్, సునీల్, శరత్ బాబు మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ మూవీకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు గ్రహీత MM కీరవాణి సంగీతాన్ని అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement