Wednesday, April 17, 2024

‘వకీల్ సాబ్’ ఇష్యూ.. జగన్‌కు వత్తాసు పలికిన నాగబాబు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా రిలీజ్ రోజు బెనిఫిట్ షోలను ఏపీలో రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీ సర్కారుపై పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పలు విమర్శలు చేశారు. అయితే ఈ అంశంపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. ఏపీ సీఎం జగన్ అలాంటి పనులు చేస్తాడంటే తాను నమ్మనని పేర్కొన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలతో జగన్ తీరికలేకుండా ఉంటారని, స్థానికంగా ఉండే కొందరు ప్రజాప్రతినిధులు, ఇతర రాజకీయ నేతలు బెనిఫిట్ షోల రద్దుకు కారకులని తాను భావిస్తున్నట్టు వెల్లడించారు. జగన్ ఈ విషయం తెలిస్తే తప్పకుండా స్పందిస్తారని నాగబాబు అభిప్రాయపడ్డారు. రాజకీయ పరమైన కారణాలతో వృత్తిపరమైన జీవితంపై ఇలా వ్యవహరించడం సరికాదని, సినిమాపై ఆధారపడే ఎంతోమంది కార్మికులు, వారి కుటుంబాలకు నష్టం వాటిల్లుతుందన్నారు.

వకీల్ సాబ్ చిత్రంపైనా నాగబాబు తన అభిప్రాయాలు వెల్లడించారు. తాను పవన్ చిత్రం చివరిసారిగా చూసింది ‘అత్తారింటికి దారేది’ అని తెలిపారు. అజ్ఞాతవాసి సినిమా రిజల్ట్ తమను బాధించిందని, మూడేళ్ల తర్వాత వకీల్ సాబ్‌తో మళ్లీ పవన్ నటించడం సంతోషం కలిగించిందని చెప్పారు. ఈ సినిమాలో పవన్ నటించాడనడం కంటే రియల్ లైఫ్‌లో ఎలా ఉంటాడో అలాగే వ్యవహరించాడనడం కరెక్టుగా ఉంటుందని నాగబాబు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement