Thursday, April 18, 2024

విశ్వ‌క్ సేన్ కి జోడీగా మీనాక్షిచౌద‌రి

న‌టి మీనాక్షి చౌద‌రి హీరో విశ్వక్‌ సేన్ స‌ర‌స‌న న‌టించే ఛాన్స్ ని కొట్టేసింది. రవితేజ ముళ్లపూడి అనే నూతన దర్శకుడు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను విశ్వక్‌ సేన్‌ తాజాగా లాంచ్‌ చేశారు. ఈ సినిమాలో విశ్వక్‌కు జోడిగా మీనాక్షిని చిత్ర యూనిట్ ఫైనల్ చేసింది. ఎస్ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుంది. మరి ఈ సినిమాతో మీనాక్షి ఫేట్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. ప్రస్తుతం ధమ్కీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న విశ్వక్‌.. ఈ సినిమా విడుదల తర్వాత కొత్త సినిమా షూటింగ్‌లో బిజీగా మారనున్నారు. ఇదిలా ఉంటే.. హిట్‌2 తర్వాత ఆఫర్లు అందుకోని మీనాక్షికి విశ్వక్‌ అయినా కలిసొస్తాడో అనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే హిట్‌2 తర్వాత మీనాక్షి తెలుగులో నటించకపోయినా తమిళంలో మాత్రం ఓ చిత్రంలో తళుక్కుమంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement