Friday, March 29, 2024

RRRకు వైద్య పరీక్షలు.. కాసేపట్లో హైకోర్టుకు నివేదిక

గుంటూరు ప్రభుత్వాస్పత్రి(జీజీహెచ్‌)లో ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ప్రత్యేక వైద్యబృందం వైద్య పరీక్షలు నిర్వహించింది. అనంతరం ఆయన్ను జిల్లా జైలుకు తరలించారు. ఈ మేరకు జిల్లా జైలు వద్ద భారీ భద్రతను మోహరించారు. గుంటూరు సీఐడీ కార్యాలయంలో పోలీసులు తనను కొట్టారని రఘురామ సీఐడీ కోర్టు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీ తరఫు న్యాయవాదులు ఇదే విషయాన్ని హైకోర్టుకు నివేదించారు. ఈ క్రమంలో రఘురామకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మొత్తం 16 రకాల వైద్య పరీక్షలు చేసినట్లు తెలుస్తోంది. కాగా రఘురామకు పరీక్షలపై వైద్య నిపుణుల కమిటీని హైకోర్టు డివిజన్ బెంచ్ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా జీజీహెచ్ సూపరింటెండెంట్, మరో ఇద్దరు డాక్టర్లు ఉన్నారు.

మరికాసేపట్లో మెడికల్‌ బోర్డు నివేదిక హైకోర్టుకు చేరే అవకాశం ఉంది. వైద్య పరీక్షల అనంతరం ఆయనను విజయవాడలోని రమేష్ ఆస్పత్రికి తరలించాలని కోర్టు ఆదేశించింది. కానీ అధికారులు జిల్లా జైలుకు తరలించడంపై ఉత్కంఠ నెలకొంది. ఏపీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరించారని ఎంపీ రఘురామను రెండు రోజుల క్రితం ఏపీ సీఐడీ పోలీసులు ఆయనను హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. కాగా రఘురామకు కోర్టు ఈ నెల 28 వరకు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement