Thursday, April 25, 2024

నామినేటెడ్ స‌భ్యుల‌కు ఓటింగ్ హ‌క్కు నో – ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు సుప్రీం షాక్

న్యూఢిల్లీ: డ ఢిల్లీ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ లో నామినేటెడ్ స‌భ్యుల‌కు ఎటువంటి ఓటు హక్కు ఉండ‌ద‌ని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఎంసీడీ మేయర్ ఎన్నిక నిర్వ‌హించాల‌ని కోరుతూ ఆప్ వేసిన పిటిష‌న్ ను విచారించిన సుప్రీం కోర్టు 24 గంట‌ల‌లోగా మేయ‌ర్ ఎన్నిక తేదిని ప్ర‌క‌టించాల‌ని ఆదేశించింది.. సుప్రీంకోర్టు నిర్ణయంతో ఆమ్ ఆద్మీ పార్టీకి కీలక ఉపశమనం లభించింది.


ఎంసీడీ మేయర్, డిప్యూటీ మేయర్, ఎంసీడీ స్టాడింగ్ కమిటీలోని 18 మంది సభ్యులలో ఆరుగురిని ఎన్నుకునేందుకు ఎంసీడీ ఇటీవల మూడుసార్లు సమావేశమైనప్పటికీ ఎన్నికల ప్రక్రియ చేపట్టకుండానే వాయిదా పడ్డాయి. నామినేట్ సభ్యులను ఓటింగ్‌‌కు ఎల్జీ ‌అనుమతించాన్ని ఆప్ వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగడం, ఆప్-బీజేపీ మధ్య ఘర్షణ వాతావారణం తలెత్తడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో మేయర్ ఎన్నికలకు ఫిబ్రవరి 16వ తేదీని ఎల్జీ ప్రకటించారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశంతో ఆ తేదీ కూడా వాయిదా పడింది. నామినేటెడ్ సభ్యులకు ఓటింగ్ హక్కును కల్పించే ఎల్జీ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో ఆప్ సవాలు చేసింది. ఈ నేపథ్యంలో నామినేట్ సభ్యులకు ఓటు హక్కు నిరాకరిస్తూ సుప్రీంకోర్టు శుక్రవారంనాడు నిర్ణయం ప్రకటించింది. దీంతో మేయ‌ర్ ఎన్నిక‌కు మార్గం సుగ‌మమం అయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement