Thursday, April 25, 2024

తార‌క‌ర‌త్న‌ని కాపాడిన డాక్ట‌ర్లు.. భ‌గ‌వంతుడికి కృతజ్ఞతలు.. చిరంజీవి

న‌టుడు తార‌క‌ర‌త్న‌ని కాపాడిన డాక్ట‌ర్ల‌కు..భ‌గ‌వంతుడికి కృతజ్ఞతలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి.ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు. సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు, ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్ని ఇచ్చిందని ఆయన అన్నారు. ఆయన త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలనుకుంటున్నానని అన్నారు. తారకరత్నను ఈ పరిస్థితి నుంచి కాపాడిన డాక్టర్లకు, ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు. ‘డియర్ తారకరత్న నీకు సంపూర్ణమైన, ఆరోగ్యవంతమైన జీవితం ఉండాలి’ అని ఆకాంక్షించారు.నటుడు తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement