Friday, April 19, 2024

వెస్టిండీస్​తో మ్యాచ్​.. సిరీస్​ కైవసం చేసుకున్న శ్రీలంక..

ప్ర‌భ‌న్యూస్ : వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను శ్రీలంక 2-0 తేడాతో సొంతం చేసుకుంది. రెండో టెస్టులో పర్యాటక విండీస్‌పై 164పరుగులు తేడాతో లంక విజయం సాధించింది. టాస్‌ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 2014పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఓపెనర్‌ నిసాంక 148బంతుల్లో 5ఫోర్లు, ఓ సిక్సర్‌తో 73పరుగులు చేసి హాఫ్‌సెంచరీతో మెరిశాడు. మరో ఓపెనర్‌ కరుణరత్నే 42పరుగులుతో ఆకట్టుకోగా మిగిలిన బ్యాటర్లు స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు. 61.3ఓవర్లలో శ్రీలంక 204పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. అనంతరం వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 253పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో పుంజుకున్న శ్రీలంక 9వికెట్లకు 345పరుగులు చేసి డిక్లేర్‌ చేసింది. లంక బ్యాటర్‌ ధనంజయ డిసిల్వా 155పరుగులతో భారీ సెంచరీ సాధించి అజేయంగా నిలిచాడు.

ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్‌లో విండీస్‌ లంక బౌలర్ల ధాటికి విలవిలలాడింది. డ్రా అవుతుందని భావించిన మ్యాచ్‌లో శ్రీలంక బౌలర్లు లసిత్‌, మెండిస్‌ తిప్పేశారు. శ్రీంక రెండో ఇన్నింగ్స్‌లో 132పరుగులుకే కుప్పకూలిపోయింది. శ్రీలంక 164పరుగులు తేడాతో ఘనవిజయం సాధించి మ్యాచ్‌తోపాటు సిరీస్‌ను కైవసం చేసుకుంది. లంక బౌలర్లు లలిత్‌, రమేశ్‌మెండిస్‌ చెరో 5వికెట్లతో విండీస్‌ పతనాన్ని శాసించారు. భారీ సెంచరీతో కదం తొక్కిన ధనంజయ డిసిల్వా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దక్కించుకోగా, రమేశ్‌ మెండిస్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ పురస్కారాన్ని దక్కించుకున్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement