Wednesday, November 13, 2024

TG | రాష్ట్రంలో భారీగా జడ్జీల బదిలీలు…

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా 70 మంది జూనియర్‌, సీనియర్‌ సివిల్‌ జడ్జీలను హైకోర్టు బదిలీ చేసింది. వివిధ జిల్లాల్లో జూనియర్‌ సివిల్‌ జడ్జీలుగా పనిచేస్తున్న 38 మందికి సీనియర్‌ సివిల్‌ జడ్జీలుగా పదోన్నతి కల్పిస్తూ కొత్త జిల్లాల్లో పోస్టింగ్‌ ఇస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ర్‌ జనరల్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.

మరో 32 మంది సీనియర్‌ సివిల్‌ జడ్జీలను పాత స్థానాల నుంచి కొత్త జిల్లాలకు బదిలీ చేశారు. వీరంతా ఈ నెల 18వ తేదీకల్లా ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాంతాల నుంచి రిలీవ్‌ కావాలని, వారి బాధ్యతలను తదుపరి ర్యాంక్‌లో ఉన్న జ్యుడిషియల్‌ ఆఫీసర్లకు అప్పజెప్పాలని పేర్కొన్నారు. ఈ నెల 24వ తేదీకల్లా కొత్త ప్రాంతాల్లో బాధ్యతలను చేపట్టాలన్నారు. పాత స్థానాల్లో రిలీవ్‌ కావడానికి ముందే రిజర్వులో ఉంచిన తీర్పులను వెలువరించాలని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement