Sunday, April 14, 2024

వాల్తేర్ వీర‌య్య షూటింగ్ లో జాయిన్ అయిన ర‌వితేజ‌-ట్వీట్ చేసిన మేక‌ర్స్

వాల్తేర్ వీర‌య్య షూటింగ్ లో జాయిన్ అయ్యారు మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ‌. మెగాస్టార్ చిరంజీవి తన 154వ సినిమాను బాబీ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమాకి ‘వాల్తేర్ వీరయ్య’ అనే టైటిల్ ను ఖరారు చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రుతి హాసన్ నటిస్తోంది. ఒక ముఖ్యమైన పాత్రలో రవితేజ నటిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఆయన తప్పుకున్నట్టుగా కూడా ప్రచారం జరిగింది. మొత్తానికి ఆయన ఈ సినిమాలో చేస్తున్నట్టుగా .. షూటింగులో జాయిన్ అయిన్నట్టుగా మేకర్స్ ఈ రోజు ప్రకటించారు. వీరిద్దరి కాంబినేషన్ పట్ల ఆసక్తిని రేకెత్తిస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. మెగాస్టార్ కారవాన్ లోకి రవితేజ ఎంటరైనట్టుగా ఒక వీడియోను రిలీజ్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, సంక్రాంతికి రిలీజ్ కానుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement