Friday, March 29, 2024

మాస్ మహారాజ్ ‘ఖిలాడీ’ టీజర్

రవితేజ హీరోగా నటిస్తున్న ‘ఖిలాడి’ మూవీ టీజర్‌ను ఉగాది కానుకగా ఒక రోజు ముందే చిత్ర బృందం సోమవారం ఉదయం విడుదల చేసింది. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో డింపుల్ హయతి, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీని సత్యనారాయణ, రమేష్ వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ టీజర్‌ను సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించినట్టు కనబడుతోంది. టీజర్ స్టార్టింగ్‌లో ఓ హార్బర్‌ను చూపిస్తూ.. జైల్లో హీరో రవితేజను చూపించారు. ఈ మూవీలో రవితేజ డ్యూయల్ రోల్‌లో నటించాడా ? ఒకడే ఇద్దరిగా ప్రవర్తించాడా అనేది ఆసక్తికరంగా మారింది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement