Thursday, April 25, 2024

రిలీజ్ అయిన మాస్ కా దాస్ ‘ధమ్కీ’ ట్రైలర్‌ 2.0

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మొదటి పాన్ ఇండియన్ మూవీ ధమ్కీ. ఈ నెల (మార్చి) 22, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది. విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాలో నివేథా పేతురాజ్ కథానాయికగా నటించింది. హైప్‌ని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు ఇవ్వాల సెకండ్ ట్రైలర్‌ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ లో మొదట విశ్వక్ సేన్ ను సంజయ్ రుద్రగా పరిచయం చూపించారు, అతను క్యాన్సర్ రహిత ప్రపంచాన్ని చూడాలనుకుంటాడు. ఆ తర్వాత వెయిటర్‌గా నటించే మరో విశ్వక్ సేన్ ను చూపించారు.

- Advertisement -

ఈ వెయిటర్ నివేథాతో ప్రేమలో పడతాడు, ట్రైలర్‌లో ప్రదర్శించిన కామెడీ బాగుంది. అకస్మాత్తుగా ట్రైలర్ యాక్షన్ మోడ్‌లోకి మారింది, విషయాలు తీవ్రంగా మారాయి. ట్రైలర్ లోని డైలాగ్స్ బాగున్నాయి. ట్రైలర్ ఆద్యంతం ఫన్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఉంది. వన్మయే క్రియేషన్స్ మరియు విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్ల పై కరాటే రాజు ఈ ధమ్కీని నిర్మించారు. రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ కీలక పాత్రల్లో నటించిన ధమ్కికి ప్రసన్న కుమార్ బెజవాడ డైలాగ్స్ రాశారు. లియోన్ జేమ్స్ ఈ సినిమాకి సంగీతం అందించారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement