Thursday, April 25, 2024

కార్ల అమ్మకాల్లో స్విఫ్ట్ @ 1

గత ఆర్థిక సంవత్సరంలో దేశంలో కార్ల విక్రయాల్లో మారుతి సుజుకి స్విఫ్ట్‌ కారు అత్యధికంగా అమ్ముడైంది. గత ఏడాది మారుతి స్విఫ్ట్‌ 1.72 లక్షల కార్లు అమ్ముడుపోయాయి. స్విఫ్ట్ తర్వాతి స్థానంలో ఉన్న బ్యాలినో కార్లను 1.63 లక్షల మేరకు విక్రయించారు. మూడో స్థానంలో ఉన్న వేగనార్‌ కారు మొత్తం 1.6 లక్షల యూనిట్లను విక్రయించారు. అటు నాలుగో స్థానంలో ఆల్టో (1.59 లక్షలు), ఐదో స్థానంలో డిజైర్‌ ( 1.28 లక్షలు) మోడళ్లు ఉన్నాయి.

ఈ ఐదు మోడళ్ల కార్లు కలిపి మొత్తం కార్ల విక్రయాల్లో 30 శాతాన్ని ఆక్రమించాయి. ఇక ఆరు నుంచి పదో స్థానంలోపు మొత్తం మూడు హ్యూండాయి మోడళ్లు ఉన్నాయి. క్రెటా (1,20,035), మారుతీ ఎకో (1,05,081), హ్యూందాయ్‌ గ్రాండ్‌ ఐ10 నియోస్‌ (1,00,611), మారుతీ విటారా బ్రెజా (94,635), హ్యుందాయ్‌ వెన్యూ (92,972) కార్లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గత ఏడాది జరిగిన కార్ల విక్రయాల్లో మారుతీకి చెందిన మోడల్సే తొలి 10 స్థానాల్లో ఏడు ఉన్నాయి. ఇక తొలి ఐదు స్థానాల్లో మారుతీ తప్ప మరో కంపెనీ మోడల్‌ కారే లేదు. 2017-18 నుంచి తొలి ఐదు స్థానాలు మారుతీ కంపెనీకే దక్కుతుండటం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement