Sunday, June 13, 2021

హ్యాట్సాఫ్… మూగ జీవాలకు పెళ్లి విందు ఏర్పాటు

ఇటీవల కాలంలో దేశంలో కాన్సెప్టు వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఏదో ఒక సదుద్దేశం నెరవేరేలా తమ పెళ్లిళ్లను ప్లాన్ చేసుకునేందుకు యువతీయువకులు ఆసక్తి చూపిస్తున్నారు. నెల్లూరుకు చెందిన ఈ కొత్త జంట కూడా తమ పెళ్లి సందర్భంగా మూగజీవాలకు విందు ఏర్పాటు చేసి అందరి అభినందనలు అందుకుంది.

నిఖిల్, రక్ష ఇటీవల పెళ్లితో ఒక్కటయ్యారు. వీరు తెలుగువారు కాదు. వ్యాపార నిమిత్తం ఉత్తర భారతదేశం నుంచి వచ్చి నెల్లూరులో స్థిరపడ్డారు. అయితే తమ పెళ్లి వినూత్నంగా ఉండాలని కోరుకున్న నిఖిల్, రక్ష తమ కుటుంబ సభ్యులను ఒప్పించి ఓ గోశాలలో విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ విందులో ఎండుగడ్డి, పచ్చగడ్డితో పాటు రకరకాల పిండివంటలు, ఫలాలను మూగజీవాలకు అందించి మురిసిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ విందు కోసం నిఖిల్, రక్ష రూ.65 వేలు ఖర్చు చేయడం విశేషం. సాధారణ పెళ్లి విందుకు ఇంతకంటే ఎక్కువ మొత్తమే ఖర్చవుతుంది. కానీ మూగజీవాల కోసం వేల రూపాయలు ఖర్చు చేయడం వారి మంచి మనసును చాటుతోంది.

Advertisement

తాజా వార్తలు

Prabha News