Thursday, April 25, 2024

Follow up | లాభాల్లో ముగిసిన మార్కెట్లు..

స్టాక్‌ మార్కెట్లు మంగళవారం నాడు లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్‌ షేర్లు రాణించడంతో సూచీలు లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఫలితంగా మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి.

సెన్సెక్స్‌ 445.73 పాయింట్ల లాభంతో 58074.68 వద్ద ముగిసింది. నిఫ్టీ 119.10 పాయింట్ల లాభంతో 17107.50 వద్ద ముగిసింది. బంగారం 10 గ్రాముల ధర 258 రూపాయలు తగ్గి 59248 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో ధర 77 రూపాయలు పెరిగి 68915 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 82.53 రూపాయిలుగా ఉంది.

లాభపడిన షేర్లు..

- Advertisement -

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టైటాన్‌ కంపెనీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఎల్‌ అండ్‌ టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, మారుతీ సుజుకీ, హిండాల్కో ఇండస్ట్రీస్‌, బజాజ్‌ ఆటో, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, హీరోమోటో కార్ప్‌ షేర్లు లాభపడ్డాయి.

నష్టపోయిన షేర్లు..

పవర్‌ గ్రిడ్‌ కార్పోరేషన్‌, హిందుస్థాన్‌ యూనిలీవర్‌, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఎం అండ్‌ ఎం, సన్‌ఫార్మా, ఐటీసీ, విప్రో, నెస్లే ఇండియా, ఓఎన్‌జీసీ, ఐచర్‌ మోటార్స్‌, అదానీ పోర్ట్స్‌, బీపీసీఎల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, ఆపోలో ఆస్పటల్స్‌ షేర్లు నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement