Friday, April 26, 2024

Follow up | ప్లాట్‌గా ముగిసిన మార్కెట్లు..

మంగళవారం నాడు స్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు రోజంతా తీవ్ర ఒడుదొడుకుల్లోనే కొనసాగాయి. చివరి గంటలో కొనుగోళ్ల మద్దతుతో కోలుకున్న మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఆర్ధిక సర్వే అంశాలు మార్కెట్లను ప్రభావితం చేశాయి. బుధవారం నాడు బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నందున ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించారు.

సెన్సెక్స్‌ 49.49 పాయింట్ల లాభంతో 59549.90 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 13.20 పాయింట్ల లాభంతో 17662.15 వద్ద ముగిసింది. బంగారం 10 గ్రాముల ధర 16 రూపాయలు పెరిగి 56798 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో ధర 525 రూపాయలు తగ్గి 68064 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 81.51 రూపాయిలుగా ఉంది.

లాభపడిన షేర్లు..

ఎం అండ్‌ ఎం, ఆల్ట్రా సిమెంట్స్‌, ఎస్‌బీఐ, ఐటీసీ, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, టాటా మోటార్స్‌, టైటాన్‌ కంపెనీ, ఎన్‌టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, మారుతీ సుజుకీ, టాటా స్టీల్‌, ఎల్‌ అండ్‌ టీ, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, అపోలో ఆస్పటల్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, బీపీసీఎల్‌, హీరో మోటోకార్ప్‌ షేర్లు లాభపడ్డాయి.

- Advertisement -

నష్టపోయిన షేర్లు..

టీసీఎస్‌, బ జాజ్‌ ఫైనాన్స్‌, టెక్‌ మహీంద్రా, సన్‌ ఫార్మా, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, విప్రో, నెస్లే ఇండియా, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement