Friday, March 29, 2024

Follow up | ఐదు రోజుల వరుస నష్టాల నుంచి కోలుకున్న మార్కెట్లు

వరుసగా 5 రోజులు నష్టాలు చూసిన మార్కెట్లు, గురువారం స్వల్పంగా కోలుకున్నాయి. సెన్సెక్స్‌, నిఫ్టీ 50 స్వల్పంగా లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్‌ స్టాక్స్‌ కోలుకున్నాయి. మెటల్‌ స్టాక్స్‌ భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్‌ 78.94 పాయింట్ల లేదా 0.14 శాతం లాభపడి, 57,634.84 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 13.45 శాతం పాయింట్లు లేదా 0.08 శాతం పెరిగి 16,985.60 వద్ద ముగిసింది. ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు రోజంతా తీవ్ర ఒడుదొడుకుల మధ్య చలించాయి.

చివరకు స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల మధ్య ఉదయం సూచీలు నష్టాలతో ట్రేడింగ్‌ ప్రారంభించాయి. సెంట్రల్‌ బ్యాంక్‌ నుంచి 54 బిలియన్‌ డాలర్ల నిధులు సమకూర్చుకోనున్నట్టు క్రెడిట్‌ సూయిజ్‌ ప్రకటించడంతో మార్కెట్లకు కాస్త ఉపశమనం లభించింది. యూరోపియన్‌ మార్కెట్లలో బుధవారం భారీగా పతనమైన ఈ కంపెనీ షేరు ప్రస్తుతం 20 శాతం మేర పుంజుకోవడం శుభప్రదం.

- Advertisement -

లాభపడిన షేర్లు..

బీపీసీఎల్‌, నెస్లే ఇండియా, ఏషియన్‌ పెయింట్స్‌, హెయుఎల్‌, టైటాన్‌ కంపెనీ, బజాజ్‌ ఆటో, పవర్‌ గ్రిడ్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌, అదానీ గ్రీన్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌, జోమాటో లిమిటెడ్‌, డీఎల్‌ఎఫ్‌, అంబుజా సిమెంట్స్‌, హిందుస్థాన్‌ జింక్‌, స్టార్‌ హెల్త్‌, గోద్రెజ్‌ కన్స్యూమర్‌, డాబర్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, టాటా మోటర్స్‌, టీవీఎస్‌ మోటర్స్‌.

నష్టపోయిన షేర్లు..

ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌, జేకే పేపర్‌, హిండాల్కో, జుబిలియంట్‌ లైఫ్‌, అపర్‌ ఇండస్ట్రీస్‌, పీఎన్‌బీ హౌసింగ్‌, జేఎస్‌పీఎల్‌, బ్లూస్టార్‌, గుజరాత్‌ ఫ్లూరోకెమ్‌, ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌, రిలయన్స్‌ ఇఫ్రా, అదానీ గ్యాస్‌, క్రిసిల్‌, ట్రిడెంట్‌ లిమిటెడ్‌, ఈమామీ, టాటా స్టీల్‌. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 82.35 గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement